- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శిరోముండనం ఆరోపణల్లో నిజం లేదు : జనసేన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని వైజాగ్ జిల్లా పెందుర్తిలో దళిత యువకునికి శిరోముండనం చేయించిన కేసులో జనసేన పాత్ర ఉందని వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ అన్నారు. కావాలనే జనసేన పై కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని వాటిని ఖండిస్తున్నామన్నారు. శిరోముండనం కేసులో పట్టుబడిన నిందితులు జనసేన పార్టీకి చెందిన వారుగా చిత్రీకరిస్తున్నారని.. ఆ ఘటనకు జనసేనకు అసలు సంబంధం లేదని శివశంకర్ మరోసారి స్పష్టంచేశారు. ఆ కేసులో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని వైజాగ్ జిల్లా పెందుర్తిలో దళిత యువకునికి శిరోముండనం చేయించిన కేసులో జనసేన పాత్ర ఉందని వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ అన్నారు. కావాలనే జనసేన పై కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని వాటిని ఖండిస్తున్నామన్నారు.
శిరోముండనం కేసులో పట్టుబడిన నిందితులు జనసేన పార్టీకి చెందిన వారుగా చిత్రీకరిస్తున్నారని.. ఆ ఘటనకు జనసేనకు అసలు సంబంధం లేదని శివశంకర్ మరోసారి స్పష్టంచేశారు. ఆ కేసులో పట్టుబడిన వారిని కఠినంగా శిక్షించాలని జనసేన డిమాండ్ చేస్తోందని చెప్పారు. అంతేకాకుండా, మరోసారి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Next Story






