- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన గెలుపును ఎవరూ ఆపలేరు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
<p>దిశ, హాలియా : నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి నాగార్జునసాగర్ లోని జానారెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలను వెదజల్లి టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు. సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. […]</p>

దిశ, హాలియా : నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి నాగార్జునసాగర్ లోని జానారెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలను వెదజల్లి టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు. సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఆయన గెలుపునకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. జానారెడ్డి మాట్లాడుతూ తాను నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని ప్రజలు గమనించాలని కోరారు. మాయమాటలతో జనాన్ని మోసం చేస్తున్న టిఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 27న హాలియాలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ప్రజా గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కుందూరు రఘువీర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి నాగరాజు యాదవ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






