అవి తేవడం టీఆర్ఎస్‌తో కాదు

by  |
అవి తేవడం టీఆర్ఎస్‌తో కాదు
X

దిశ, హాలియా: గిరిజనులకు రిజర్వేషన్ తేవడం టీఆర్ఎస్ ప్రభుత్వంతో కాదని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం తన నివాసంలో ఆయన సమక్షంలో ఆయా పార్టీలకు చెందిన పలు తండాల కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో గిరిజన బిల్లు ప్రవేశపెట్టినట్లైతే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని కేసీఆర్‌కు పలుమార్లు చెప్పినా, ఆయన వినకుండా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధిస్తానని చెప్పారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు వ్యతిరేకంగా చేస్తున్నదని విమర్శించారు.

సాగర్‌లో తన గెలుపుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రావాలని, అందుకు ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వయసులో తాను ఏదో పదవులు అనుభవించాలనో పోటీకి సిద్ధం కాలేదని, రాబోయే తరానికి మంచి నాయకత్వాన్ని అందించడంతోపాటు ఆదర్శవంతమైన నాయకులు తయారు చేయాల్సిన అవసరముందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఎస్ఎల్‌బీసీ పథకం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడూ అదే స్థితిలో ఉందని, అయితే తాను మళ్లీ రంగ ప్రవేశం చేస్తున్నాననే భయంతో హడావుడిగా ఎత్తిపోతల శంకుస్థాపన చేశారని, ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తున్నారని, వారు ఓటుతో టీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెబుతారన్నారు.


Next Story

Most Viewed