‘జనగణమన’ స్క్రిప్ట్ సిద్ధం.. మరి హీరో?

by  |
‘జనగణమన’ స్క్రిప్ట్ సిద్ధం.. మరి హీరో?
X

పవర్‌ఫుల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు హీరోలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి పూరీ దర్శకత్వంలో సినిమా చేశారంటే చాలు.. మాస్ ఫాలోయింగ్ పెరిగిపోవడం పక్కా అనేది ఇండస్ట్రీ టాక్. అందుకే చిన్న హీరో నుంచి సూపర్‌స్టార్ల వరకు అందరూ ఆయనతో పని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఇస్మార్ట్ హిట్ అందుకున్న పూరీ.. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు. కాగా లాక్‌డౌన్ టైమ్‌లో ‘జనగనమణ’ స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడంట ఈ డేరింగ్ డైరెక్టర్. ముందుగా మహేశ్ కోసమే ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసినప్పటికీ.. అతడికి, పూరీకి మధ్య కొంతకాలంగా గ్యాప్ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూరీ తన కథకు మహేశ్‌నే హీరోగా కంటిన్యూ చేస్తాడా..? లేక మరో హీరోను పెట్టి సినిమా చేస్తాడా? త్వరలో క్లారిటీ రానుంది‌

కానీ మహేశ్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్ చాట్ చేసిన సందర్భంలో.. తను పూరీ చెప్పే కథ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలపడం గమనార్హం. ఈ స్టేట్‌మెంట్‌తోనైనా.. మళ్లీ ఇద్దరూ కలుస్తారా? జనగనమణ చేస్తారా? లేదా అన్నది చూడాలి.

Next Story

Most Viewed