మర్కజ్‌కు వెళ్లిన జనగామ వాసికి కరోనా

by Shyam |   (  Updated:2020-04-02 07:59:43  IST  )

<p>దిశ, వరంగల్: ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన జనగామ జిల్లా వాసికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వ్యక్తి జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండకు చెందిన ఖాజాగా అధికారులు గుర్తించారు. మరో ఇద్దరికి రిపోర్టులో నెగిటివ్ వచ్చినట్టు కలెక్టర్ నిఖిల వెల్లడించారు. ఈ ముగ్గురు గత నెల జనగామ‌ నుంచి ఢిల్లీలో జరిగిన మర్కజ్ సభకు వెళ్లి వచ్చారు. మూడు రోజుల కిందట వారిని గుర్తించి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపించగా ఈ [&hellip;]</p>

దిశ, వరంగల్: ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన జనగామ జిల్లా వాసికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వ్యక్తి జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండకు చెందిన ఖాజాగా అధికారులు గుర్తించారు. మరో ఇద్దరికి రిపోర్టులో నెగిటివ్ వచ్చినట్టు కలెక్టర్ నిఖిల వెల్లడించారు. ఈ ముగ్గురు గత నెల జనగామ‌ నుంచి ఢిల్లీలో జరిగిన మర్కజ్ సభకు వెళ్లి వచ్చారు. మూడు రోజుల కిందట వారిని గుర్తించి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపించగా ఈ విషయం బయట పడింది. అయితే పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు అనే కోణంలో అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags : corona positive, jangaon dist, collector nikhila

Next Story