కేసీఆర్‌ను ఈటల ఎన్నో సార్లు ప్రశ్నించారు: జమున

by Sridhar Babu |

<p>దిశ, జమ్మికుంట: రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఈటల రాజేందర్ అనేకమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు అని ఈటల సతీమణి ఈటల జమున అన్నారు. సోమవారం జమ్మికుంట మండలంలోని మాచనపల్లి, తనుగుల, శంభునిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల జమున ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జరగబోయే ఉప ఎన్నికల్లో ధర్మం, న్యాయం గెలవాలని ప్రజలు అనుకుంటున్నారు అని, ఈటల రాజేందర్ పేరు చెబితే పలుచోట్ల మీకు పేరు దక్కిందని, అలాంటి [&hellip;]</p>

కేసీఆర్‌ను ఈటల ఎన్నో సార్లు ప్రశ్నించారు: జమున
X

దిశ, జమ్మికుంట: రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఈటల రాజేందర్ అనేకమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు అని ఈటల సతీమణి ఈటల జమున అన్నారు. సోమవారం జమ్మికుంట మండలంలోని మాచనపల్లి, తనుగుల, శంభునిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల జమున ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జరగబోయే ఉప ఎన్నికల్లో ధర్మం, న్యాయం గెలవాలని ప్రజలు అనుకుంటున్నారు అని, ఈటల రాజేందర్ పేరు చెబితే పలుచోట్ల మీకు పేరు దక్కిందని, అలాంటి వ్యక్తిని గెలిపించాలని ప్రజలను కోరారు. అంతకు ముందు గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో, బతుకమ్మ బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు

Next Story