చెరువులా మారిన రహదారి.. జల్‌పల్లికి దారేది..?

by  |
చెరువులా మారిన రహదారి.. జల్‌పల్లికి దారేది..?
X

దిశ, జల్‌పల్లి: పట్ణణ ప్రగతిలో భాగంగా ప్రతినెల మున్సిపాలిటీకి రూ. 48 లక్షల నిధులు మంజూరు అవుతున్నా.. జల్‎పల్లికి వెళ్లే ప్రధాన రహదారికి మాత్రం మోక్షం కలుగడం లేదు. హైదరాబాద్ లక్ష్మిగూడ నుంచి జల్‌పల్లికి వెళ్లాలన్నా.. షాహిన్‌నగర్ నుంచి జల్‌పల్లిలోకి రావాలన్నా.. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

చినుకుపడితే జల్‎​పల్లి మున్సిపాలిటీలోని ప్రధాన రహదారులు చిత్తడి అవుతున్నాయి. ఇక భారీ వర్షానికి మాత్రం పరిస్థితి మరింత అద్వానంగా మారుతున్నది. పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు ఆ రహదారి గుండా వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో అదుపుతప్పి నీటిలో పడిపోతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కనీసం గుంతలు తేలిన రహదారుల్లో అయినా మరమ్మత్తులు చేయడం లేదని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని.. కనీసం ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed