- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబానీ నీకు ధమ్ కీ ఇచ్చింది మేమే.. ఐష్ ఉల్ హింద్ ఉగ్రవాదుల హెచ్చరిక
<p>దిశ,వెబ్‌డెస్క్: బిలీనియర్ ముకేశ్అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో కారు పార్క్ చేసింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ ఐష్ ఉల్ హింద్ టెలిగ్రామ్ ద్వారా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ముకేష్ అంబానీ ఇంటి సమీపంలో గుర్తు తెలియని అగంతకులు ఓ లెటర్ తో పాటూ 20 జిలిటెన్ స్టిక్స్ ఉంచిన వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకున్న కేంద్ర భద్రతా బలగాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ దర్యాప్తులో భాగంగా […]</p>

దిశ,వెబ్‌డెస్క్: బిలీనియర్ ముకేశ్అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో కారు పార్క్ చేసింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ ఐష్ ఉల్ హింద్ టెలిగ్రామ్ ద్వారా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ముకేష్ అంబానీ ఇంటి సమీపంలో గుర్తు తెలియని అగంతకులు ఓ లెటర్ తో పాటూ 20 జిలిటెన్ స్టిక్స్ ఉంచిన వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకున్న కేంద్ర భద్రతా బలగాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ దర్యాప్తులో భాగంగా ముఖేష్ అంబానీని టార్గెట్ చేసింది ఐష్-ఉల్-హింద్ ఉగ్రవాదులేనని తేలింది.
అందుకు సంబంధించిన ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టెలిగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఐష్ ఉల్ హింద్ మెసేజ్ ప్రకారం.. ముఖేష్ అంబానీని బిట్ కాయిన్ ద్వారా డబ్బుల్ని డిమాండ్ చేశారు. ‘అడిగినంత డబ్బుల్ని బిట్ కాయిన్ రూపంలో పంపక పోతే మీ ఇంటి ముందు 20జిలిటెన్ స్టిక్స్ కారు ఈ సారి మీ పిల్లలు నడిపే కార్లలో కలుస్తుంది. ఇప్పుడు మీకు ఏం చేయాలో బాగా తెలుసు. ముందు మేం అడిగినట్లు డబ్బులు పంపండి’. మీరు డబ్బులు పంపకపోతే తరువాత మా వల్ల జరిగే పరిణామాల్ని వీలైతే అడ్డుకోండి అంటూ దర్యాప్తు సంస్థలకు సవాల్ చేశారు.







