తారక్‌కు జోడీగా శ్రీదేవి కూతురు

by  |
తారక్‌కు జోడీగా శ్రీదేవి కూతురు
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ మరో హీరోగా రూపుదిద్దుకుంటున్న ఈ మల్టీ స్టారర్ మూవీ పూర్తయ్యాకే మరో సినిమాకు అనుమతిస్తారు జక్కన్న. అయితే తారక్ ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మూవీ ప్రకటించగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి ‘అయిననూ పోయిరావలే హస్తినకు’ టైటిల్ పరిశీలనలో ఉండగా.. తారక్ పొలిటీషియన్‌గా కనిపించనున్నాడు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు అవకాశం ఉండగా.. టాలీవుడ్‌లో ప్రజెంట్ టాప్ హీరోయిన్స్ అయిన పూజా హెగ్డే, సమంత, రష్మిక మందన్నా వీరిలో ఒకరు హీరోయిన్‌గా ఎంపికయ్యే ఛాన్స్ ఉందట. ఇక అతిలోక సుందరి శ్రీదేవి అందాల తనయ జాన్వీ మరో కథానాయికగా ఫైనల్ అయిందని సమాచారం. శ్రీదేవి కూతురిని తెలుగులో లాంచ్ చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరిగాయి కానీ.. తను ఒప్పుకోలేదు. ముఖ్యంగా పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాకు కూడా నో చెప్పిన జాన్వీ.. ఫస్ట్ టైమ్ తెలుగు తెరపై కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.



Next Story

Most Viewed