శ్రీదేవిని మరిపిస్తున్న జాన్వి డ్యాన్స్

by Shyam |   (  Updated:2020-02-25 05:25:24  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ దేవకన్యలా నర్తించింది. &#8216;పియా తోసే నయనా లాగే&#8217; క్లాసికల్ సాంగ్‌కు తన స్టెప్స్‌తో మెప్పించింది. ఈ పాటపై డ్యాన్స్ చేసిన వీడియోను జాన్వి సోషల్ మీడియాలో షేర్ చేయగా&#8230; ఫిదా అయిపోయారు నెటిజన్లు. చాలా గ్రేస్‌తో డ్యాన్స్ చేసిందని, తల్లికి మించి అందంగా నర్తించిందని ప్రశంసిస్తున్నారు. ధడక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి ఆచితూచి అడుగులు వేస్తోంది. ధడక్ తర్వాత ది కార్గిల్ గర్ల్ [&hellip;]</p>

శ్రీదేవిని మరిపిస్తున్న జాన్వి డ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ దేవకన్యలా నర్తించింది. ‘పియా తోసే నయనా లాగే’ క్లాసికల్ సాంగ్‌కు తన స్టెప్స్‌తో మెప్పించింది. ఈ పాటపై డ్యాన్స్ చేసిన వీడియోను జాన్వి సోషల్ మీడియాలో షేర్ చేయగా… ఫిదా అయిపోయారు నెటిజన్లు. చాలా గ్రేస్‌తో డ్యాన్స్ చేసిందని, తల్లికి మించి అందంగా నర్తించిందని ప్రశంసిస్తున్నారు.

ధడక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి ఆచితూచి అడుగులు వేస్తోంది. ధడక్ తర్వాత ది కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటించిన ఆమె… ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు దోస్తానా 2, తఖ్త్ సినిమాల్లోనూ నటిస్తోన్న జాన్వీ ధడక్ సినిమాతోనే మంచి నటిగా ప్రశంసలు అందుకుంది. ఫిబ్రవరి 24న తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన జాన్వి ఈ వీడియోతో ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచింది. లాస్ట్‌లో బ్యాలెన్స్ కోల్పోయిన జాన్వి… అలా అయినప్పుడు ఎండింగ్ డ్రమాటిక్‌గా ఉండాలంటూ టిప్స్ కూడా ఇచ్చింది.

View this post on Instagram

When u lose balance so u have to improv an over dramatic end 🕺🏼🎶🌈

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

Next Story