టీకా వేయించుకున్న తొలి తెలంగాణ ఎమ్మెల్యే

by  |
టీకా వేయించుకున్న తొలి తెలంగాణ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రైవేటు దవాఖానల్లో కూడా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ప్రైవేట్‌ హాస్పిటళ్ల వైద్య సిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ కరోనా టీకా తీసుకున్నారు. జగిత్యాలలోని జిల్లా ప్రధాన తన ఆస్పత్రిలో సోమవారం ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా పంపిణీని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కూడా టీకా వేసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కొన్ని జాగ్రత్తలు సూచించారు. మొదట కోవిడ్‌ వారియర్స్‌ ఉన్న వారికి టీకా వేస్తున్న నేపథ్యంలో వైద్యుల కోటాలో ఆయన టీకా వేయించుకున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే, రాష్ట్రంలో కోవిడ్ టీకా వేయించుకున్న తొలి ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ నిలిచారు.

Next Story