మెదక్‌లో గేమ్ స్టార్ట్.. కేసీఆర్, హరిష్ రావు స్థానాలను కైవసం చేసుకుంటాం.. జగ్గారెడ్డి

by  |
MLA Jagga Reddy
X

దిశ ప్రతినిధి, మెదక్: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఆట మొదలైందని, 2023లో సిద్దిపేట, గజ్వేల్‌ అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంటామని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియా‌తో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీ‌దేనన్నారు. మెదక్‌లో గెలుపు కోసం జిల్లా నేతలు బాగా పని చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయినా ఓటు బ్యాంకును కాపాడుకున్నామని చెప్పారు. 230 ఓట్లకు ఒక్కటి తగ్గినా రాజీనామా చేస్తానని శపథం చేశానని, మాకున్న ఓట్ల కంటే ఏడు ఓట్లు అదనంగా సాధించామన్నారు. నా మాటను కాంగ్రెస్ శ్రేణులు ఛాలెంజ్‌గా తీసుకొని పని చేశారని తెలిపాడు.

ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌‌.. ట్రబుల్‌లో పడ్డారని, కాంగ్రెస్‌ భయంతోనే హరీశ్‌రావు క్యాంపులు పెట్టారని విమర్శించారు. హరీశ్‌ క్యాంపు పెట్టకపోతే.. మా సత్తా చూపించేవాళ్లమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వల్ల జిల్లాలో స్థానిక నేతలు హ్యాపీగా ఉన్నారని పేర్కొన్నారు. వరి కుప్పలపై రైతులు చనిపోతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతిమ నిర్ణయాధికారం పీసీసీ చీఫ్ కే ఉంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేవలం పనికే పరిమితమని, రాష్ట్ర పార్టీ వ్యవహారాల గూర్చి తాను మాట్లాడానని చెప్పారు.


Next Story

Most Viewed