ఎక్కువ మాట్లాడితే కోమటిరెడ్డి బట్టలు ఊడదీస్తా: జగదీష్ రెడ్డి(వీడియో)

by Vadlamudi Anukaran |   (  Updated:2023-05-01 06:30:46  IST  )

<p>దిశ, మునుగోడు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో ఆహారభద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం టీఆర్ఎస్ పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఇకపై ఊరుకునేది లేదని.. ఎక్కువ మాట్లాడితే బట్టలు ఊడదీస్తానని హెచ్చరించారు. ఇప్పటివరకు తాను ఎవరి జోలికి వెళ్ళ లేదని అనవసరంగా తనతో పెట్టుకుంటే […]</p>

ఎక్కువ మాట్లాడితే కోమటిరెడ్డి బట్టలు ఊడదీస్తా: జగదీష్ రెడ్డి(వీడియో)
X

దిశ, మునుగోడు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో ఆహారభద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం టీఆర్ఎస్ పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఇకపై ఊరుకునేది లేదని.. ఎక్కువ మాట్లాడితే బట్టలు ఊడదీస్తానని హెచ్చరించారు. ఇప్పటివరకు తాను ఎవరి జోలికి వెళ్ళ లేదని అనవసరంగా తనతో పెట్టుకుంటే సహించేది లేదని అన్నారు. మీరు భయపెడితే భయపడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదని కౌంటర్ ఇచ్చారు. 2004కు ముందు ఆ తర్వాత తమరి బతుకులు ఏందో ప్రజలకు తెలుసునని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా, కృష్ణానది నీళ్లను రాజశేఖర రెడ్డికి తాకట్టుపెట్టిన దొంగలు కోమటిరెడ్డి బ్రదర్స్ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. పదివేల మందితో తనను అడ్డుకుంటానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే పిలుపునకు పట్టుమని పదిమంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు వారు చేసే మోసాలు అర్థమయ్యాయని, వ్యక్తిగత జీవితంలోకి అడుగుపెడితే మీ సంగతి కూడా తేలుస్తామని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.

Next Story