- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ్ సినిమాకు జగ్గూ భాయ్ డబ్బింగ్
<p>దిశ, వెబ్‌డెస్క్: జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో సూపర్ డూపర్ సక్సెస్‌లతో దూసుకుపోతున్నారు. తెలుగులో జగ్గూ భాయ్ నటించిన ‘FCUK’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. తమిళ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. ఈ క్రమంలో సౌత్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ‘లాభం’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న జగపతి బాబు.. ఇప్పటికే తన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపాడు. చాలా కాలం తర్వాత […]</p>

దిశ, వెబ్‌డెస్క్: జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో సూపర్ డూపర్ సక్సెస్‌లతో దూసుకుపోతున్నారు. తెలుగులో జగ్గూ భాయ్ నటించిన ‘FCUK’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. తమిళ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. ఈ క్రమంలో సౌత్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ‘లాభం’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న జగపతి బాబు.. ఇప్పటికే తన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపాడు. చాలా కాలం తర్వాత తమిళ్ సినిమాకు డబ్బింగ్ చెప్తున్నానని తెలిపిన జగ్గూ భాయ్..డబ్బింగ్ స్టూడియో బిహైండ్ సీన్స్ అంటూ ట్విట్టర్ వేదికగా వీడియో షేర్ చేశాడు.
ఎస్పీ జననాధన్ దర్శకత్వంలో వస్తున్న ‘లాభం’ సినిమాలో సేతుపతికి జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా..డి ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. సాయి ధన్షిక, కలై యారసన్ కీలకపాత్రల్లో కనిపించబోతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీని విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్, సెవెన్ సీస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
I was pretty excited to dub in Tamil after so long. Here's behind the scenes from the dubbing studio for @VijaySethuOffl's #Labham. pic.twitter.com/UVJWtlcXWv
— Jaggu Bhai (@IamJagguBhai) January 30, 2021






