- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే సుబ్బయ్య మృతికి జగన్ సంతాపం
<p>దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకట సుబ్బయ్య మృతి పట్ల ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించడంతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుబ్బయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బయ్య.. కడపలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకట సుబ్బయ్య మృతి పట్ల ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించడంతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుబ్బయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బయ్య.. కడపలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన మృతితో నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతికి వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటిస్తున్నారు.
Next Story






