జగన్ ప్రభుత్వంలోనే బీసీలకు స్వర్ణయుగం

by  |
mlc
X

దిశ, ఏపీ బ్యూరో: ఉన్నత చదువులు – ఉత్తమ పదవులు కేవలం కొన్ని కులాలకు మాత్రమే పరిమితమనే రోజులకు కాలం చెల్లిందని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. కులం, మతం చూడకుండా.. ధనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా.. వారసత్వ రాజకీయాలను ఏమాత్రం పట్టించుకోకుండా.. విశ్వసనీయత – నిబద్ధతతో పని చేయాలనే తపన–తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు – గౌరవం ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నట్లు అప్పిరెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పెరిక కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పి.గంగాభవాని అధ్యక్షతన పెరిక కులస్తుల రాష్ట్ర స్థాయి నేతల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన అప్పిరెడ్డి బలమైన నాయకత్వంగా బీసీలను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ శకానికి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.

సమకాలీన రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళలకు పెద్ద పీట వేసిన ఏకైక నాయకుడు జగన్ అని అభివర్ణించారు. బీసీల సంక్షేమానికి దివంగత సీఎం వైఎస్ఆర్ ముందడుగు వేస్తే.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ నాలుగడుగులు ముందుకు వేసి బీసీ జన బాంధవుడుగా నిలిచారని కొనియాడారు. అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలన్న పెద్ద మనసుతో వెనుకబడిన తరగతుల్లో ఆఖరి వరసన ఉన్న ఆఖరి వ్యక్తి వరకు లబ్ధి చేకూరుస్తున్న మహనీయుడు సీఎం జగన్ అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జగన్‌ నాయకత్వంలో పని చేస్తున్న ప్రభుత్వం బీసీలదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. బీసీల సంక్షేమమే జగన్‌ లక్ష్యమన్నారు. తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడంతో పాటు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న జగన్‌ హయాం బీసీలకు స్వర్ణ యుగమని కొనియాడారు.


Next Story

Most Viewed