- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ అన్యాయం: జగన్
by Vemula.Srinu Prasad |
<p> సీఎం జగన్ ఉత్తరాంధ్ర, రాయలసీమకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ అన్యాయం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. చంద్రబాబు హయాంలో అనేక కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని వచ్చిన ఆ కంపెనీలను వైసీపీ ప్రభుత్వం బెదిరిస్తున్నదని లోకేశ్ ఆరోపించారు. ఏపీకి వస్తాం అని ఒప్పందం చేసుకున్న ఆ కంపెనీలను వద్దు పొమ్మంటున్నారనీ, రాష్ట్రానికి పెట్టుబడులు […]</p>

X
సీఎం జగన్ ఉత్తరాంధ్ర, రాయలసీమకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ అన్యాయం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. చంద్రబాబు హయాంలో అనేక కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని వచ్చిన ఆ కంపెనీలను వైసీపీ ప్రభుత్వం బెదిరిస్తున్నదని లోకేశ్ ఆరోపించారు. ఏపీకి వస్తాం అని ఒప్పందం చేసుకున్న ఆ కంపెనీలను వద్దు పొమ్మంటున్నారనీ, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ఎలాగూ చేతకాదు, అలాంటప్పుడు ఉన్న కంపెనీలను తరిమేసి యువత భవితపై దెబ్బకొట్టకండి జగన్ గారూ అంటూ లోకేశ్ హితవు పలికారు. ఈ మేరకు చంద్రబాబు హయాంలో వచ్చిన కంపెనీలను తన ట్వీట్‌లో జతపరిచి పోస్ట్ చేశారు.
Next Story






