నరాలు తెగే ఉత్కంఠ.. ఏపీ రాజధాని ఏది?

by  |

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు అత్యవసర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టులో తెలిపారు. కాసేపట్లో దీనిపై అసెంబ్లీలో జగన్ ప్రకటన చేస్తారని హైకోర్టుకు ఏజీ స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీలో జగన్ ప్రకటనపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.

కొత్త బిల్లు ప్రవేశపెట్టే అవకాశముందనే వార్తల నేపథ్యంలో జగన్ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ రాజధాని ఏది? అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడంలో వ్యూహం దాగి ఉందా? అనే విశ్లేషణలు జరుగుతున్నాయి. కేంద్రమంత్రి అమిత్ షా నుంచి ఆదేశాలు రావడంతో రాష్ట్ర బీజేపీ నేతలు అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్న తరుణంలో ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది.

కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతోనే జగన్ ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకుందనే ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా శానసమండలిలో మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం లభించలేదు. దీంతో పాటు రైతుల భూములకు సంబంధించిన పలు టెక్నికల్ సమస్యలు ఉండటంతో ప్రస్తుతం హైకోర్టులో మూడు రాజధానలు బిల్లుపై రోజువారీ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే ప్రచారం సాగుతోంది.

ఇంటర్వెల్ మాత్రమే..శుభం కార్డుకు టైం ఉంది: మంత్రి పెద్దిరెడ్డి

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story

Most Viewed