ప్రణబ్ మృతి : జగన్, చంద్రబాబు సంతాపం 

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-31 08:10:48  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని అన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంక్షోభాలను పరిణితితో పరిష్కరించిన తీరు ఆదర్శనీయం అని ప్రశంసించారు. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ప్రణబ్‌ దేశానికి ఎంతో సేవలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు సానుభూతి [&hellip;]</p>

ప్రణబ్ మృతి : జగన్, చంద్రబాబు సంతాపం 
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని అన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంక్షోభాలను పరిణితితో పరిష్కరించిన తీరు ఆదర్శనీయం అని ప్రశంసించారు. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ప్రణబ్‌ దేశానికి ఎంతో సేవలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఇక ప్రణబ్ ముఖర్జీ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం అసాధారణమైన అనుభజ్ఞుడిని, ప్రణాళికాబద్ధుడిని, క్రమశిక్షణ కలిగిన గొప్ప నేతను కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు సానుభూతి తెలిపారు చంద్రబాబు.

Next Story