- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిక్కుల్లో నటి జాక్వెలిన్.. ఈడీ విచారణలో షాకింగ్ వాస్తవాలు
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చంద్రశేఖర్ సుఖేష్ కేసులో ఆమె కూడా భాగస్వామి అని ఈడీ ఇప్పటికే ఆమెను ప్రశ్నించింది. అయితే సుఖేష్ నుంచి ఆమె పర్షియన్ పిల్లి, ఓ గుర్రంతో పాటు కాస్త నగదును కూడా అందుకుందని ఈడీ ఆరోపించింది. అయితే తాజాగా జరిగిన విచారణలో సుఖేష్ మరిన్ని విషయాలను వెల్లడించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. జాక్వెలిన్‌కే కాకుండా అమ్మడి తల్లిదండ్రులకు కూడా బహుమతులు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చంద్రశేఖర్ సుఖేష్ కేసులో ఆమె కూడా భాగస్వామి అని ఈడీ ఇప్పటికే ఆమెను ప్రశ్నించింది. అయితే సుఖేష్ నుంచి ఆమె పర్షియన్ పిల్లి, ఓ గుర్రంతో పాటు కాస్త నగదును కూడా అందుకుందని ఈడీ ఆరోపించింది. అయితే తాజాగా జరిగిన విచారణలో సుఖేష్ మరిన్ని విషయాలను వెల్లడించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. జాక్వెలిన్‌కే కాకుండా అమ్మడి తల్లిదండ్రులకు కూడా బహుమతులు ఇచ్చానని సుఖేష్ తెలిపాడని అధికారులు చెప్పారు. వారికి మసరాటి, పోర్ష్ కార్లను బహూకరించాడట.
అదే విధంగా ఆమె సోదరికి బీఎమ్‌డబ్ల్యూ కారును ఇచ్చానని, అంతేకకుండా దాదాపు 1.8లక్షల డాలర్లు ఇచ్చానని, జాక్వెలిన్ చెప్పినట్లు 1.5 లక్షల డాలర్లు కాదని సుఖేష్ తెలిపాడట. వాటితో పాటుగా తన ప్రైవేట్ జెట్ వినియోగించుకునేందుకు కూడా జక్వెలిన్‌కు వీలు కల్పించినట్లు సుఖేష్ చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో జాక్వెలిన్ మెడకు ఉన్న ఈడీ ఉచ్చు మరింత బిగుసుకుంది. మరి ఈ కేసు మునుముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
- Tags
- jacqueline






