ముద్దు వివాదంలో చిక్కిన హాట్ బ్యూటీ.. సమాధానం కావాలంటున్న ఫ్యాన్స్

195
jacqueline fernandez copy

దిశ, సినిమా: శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జైలుకెళ్లిన సుఖేష్ చంద్రశేఖర్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్వెలిన్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, అతనితో దిగిన ఓ రొమాంటిక్ పిక్ తాజాగా నెట్టింట్లో వైరల్ కావడంతో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. సదరు పిక్‌లో జాక్వెలిన్, సుఖేష్‌ను గట్టిగా హత్తుకొని చెంపమీద ముద్దు పెడుతుండగా అతను సెల్ఫీ తీస్తుండటం చూడొచ్చు.

కాగా ఈ పిక్ చూసిన నెటిజన్లు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈడీ ఇంటరాగేషన్‌లో ప్రతిసారీ సుఖేష్‌తో సంబంధం లేదని జాక్వెలిన్ చెప్పిందని, ఆమె తరఫు లాయర్ కూడా వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఇపుడు ‘ఏం సమాధానం చెబుతావ్ జాక్వెలిన్’ అంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.