ఆయనతో డేటింగ్ చేసిన జాక్వెలిన్.. క్లోజ్‌‌గా ఉన్న ఫొటోస్ వైరల్

by  |

దిశ, సినిమా: శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చిక్కుల్లో పడింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న నటి.. రూ. 200 కోట్ల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పింది. కానీ ప్రస్తుతం జాక్వెలిన్ – సుఖేష్ చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

సుఖేష్ చంద్రశేఖర్ మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సమయంలో ఏప్రిల్ – జూన్ మధ్య ఈ ఫొటో దిగినట్లు తెలుస్తుండగా.. జాక్వెలిన్-సుఖేష్ చెన్నైలో దాదాపు నాలుగు సార్లు కలిశారని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయనతో సహా మరో 13 మంది దాదాపు రూ.200 కోట్ల మేర మోసం చేశారని అభియోగాలు నమోదయ్యాయి. కాగా సుఖేష్‌ చంద్రశేఖర్‌, ఆయన భార్య లీనాపై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి నోరా ఫతేహికి కూడా నోటీసులు అందాయి.

నువ్వు ఒంటిరి కాదు.. స్టార్ నటి ఎమోషనల్ పోస్ట్

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story