స్టాఫ్ మెంబర్‌కు కారు గిఫ్ట్ ఇచ్చిన జాక్వెలిన్

by  |
స్టాఫ్ మెంబర్‌కు కారు గిఫ్ట్ ఇచ్చిన జాక్వెలిన్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యామిలీతో పాటు స్టాఫ్ మెంబర్స్‌కు కూడా అధిక ప్రాధాన్యతనిస్తుంది. ముఖ్యంగా తన సోషల్ మీడియా పోస్టుల్లో ఎక్కువగా స్టాఫ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నవే ఉంటాయి. తన సక్సెస్‌లో భాగమైన వారిని సంతోషంగా ఉంచేందుకు ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటుంది భామ. ఇందులో భాగంగానే దసరా రోజున తన స్టాఫ్ మెంబర్స్‌లో ఒకరికి కాస్ట్లీ కారు గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసినట్టు తెలుస్తోంది. తను ఇప్పుడు వర్క్ చేస్తున్న సెట్ దగ్గరికే కారు డెలివరీ కాగా, పూజ కూడా చేశారట. జాక్వెలిన్ ఇంతకు ముందు తన మేకప్ ఆర్టిస్ట్‌కు కూడా కారు బహుమతిగా ఇచ్చింది. దీంతో జాక్వెలిన్ బెస్ట్ గిఫ్ట్స్ ఇచ్చే బాలీవుడ్ సెలెబ్రిటీగా మారింది.

కాగా జాక్వెలిన్.. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్ నటిస్తున్న భూత్ పోలీస్‌లో ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. దీంతో పాటు తాజాగా రోహిత్ శెట్టి, రణ్ వీర్ సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న సర్కస్ సినిమాలోనూ చాన్స్ కొట్టేసింది. మొత్తానికి క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న భామ.. క్రేజీ గిఫ్ట్స్ ఇచ్చి అందరినీ హ్యాపీగా ఉంచుతోంది.



Next Story

Most Viewed