జెసిండా అడార్న్‌కు భారీ ఆధిక్యత

by  |
జెసిండా అడార్న్‌కు భారీ ఆధిక్యత
X

దిశ, వెబ్ డెస్క్: న్యూజిలాండ్ జనరల్ ఎలక్షన్‌లో మధ్యే-వామపక్ష లేబర్ పార్టీ భారీ ఆధిక్యతతో విజయాన్ని కైవసం చేసుకుంది. కరోనాపై విజయవంతంగా పోరుసల్పిన ప్రధాని జెసిండా అడార్న్ ఆ దేశ ప్రజలు పట్టంకట్టారు. దీంతో జెసిండా అడార్న్ ఇతర పార్టీల సహకారం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలదు. 1996లో నూతన ఓటింగ్ పద్ధతిని అవలంబించినప్పటి నుంచి తొలిసారిగా ఒకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కానుంది.

ఇన్నాళ్లు నేషనలిస్ట్ పార్టీతో ప్రభుత్వాన్ని నడిపిన జెసిండా అడార్న్ దేశప్రజలకు హామీనిచ్చిన మార్పును సాధించలేకపోయారు. కానీ, ఈ సారి ప్రజలు అడార్న్‌పై విశ్వాసం పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఈ ఫలితాలు కీలకమైన ఒక కుదుపును, మార్పును సూచిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వామపక్ష సర్కారువైపు ప్రజలు మొగ్గుచూపారు. వామపక్ష ప్రభుత్వం ఏర్పడితే పన్నుల మోత మోగుతుందని ప్రతిపక్షాలు గగ్గోలుపెట్టినప్పటికీ అధికారంలోకి రాగానే సంపన్నులపై పన్ను పెంచుతామని అడార్న్ హామీనివ్వడం గమనార్హం.

తాజా ఫలితాల్లో లేబర్ పార్టీ 49.0శాతం, నేషనల్ 27శాతం ఓట్లను సాధించాయి. కరోనా నిర్వహణపై ఒక రిఫరెండంలాగే ఈ ఎన్నికల ఫలితాలు కనిపిస్తున్నాయని అభిప్రాయాలు వస్తున్నాయి. క్రీస్ట్ ‌చర్చ్‌లో ఓ శ్వేతజాత్యంహకార తీవ్రవాది విచక్షణారహిత కాల్పులు జరిపినప్పుడు విద్వేషం వ్యాప్తి కాకుండా పరిస్థితులను చక్కదిద్దడంలో జెసిండా అడార్న్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నారు.


Next Story

Most Viewed