‘‘ఇచట వాహనములు నిలుపరాదు’’ అప్‌డేట్

by  |
‘‘ఇచట వాహనములు నిలుపరాదు’’ అప్‌డేట్
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో సుశాంత్ లేటెస్ట్ సినిమా ‘ఇచట వాహనములు నిలుపరాదు’. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎస్.‌దర్శన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ తర్వాత మొదలయ్యింది. ఒక్క సాంగ్ మినహా శుక్రవారంతో షూటింగ్ పూర్తి అయినట్లు తెలిపాడు హీరో సుశాంత్. ఇందుకు సహకరించిన యంగ్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సమయాల్లో షూటింగ్ కంప్లీట్ అయితే వచ్చే సంతృప్తి చాలా బాగుంటుందని చెప్పారు.

ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్న సినిమాను ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్‌పై రవిశంకర్ శాస్త్రి, హరీష్ కోయల గుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.



Next Story

Most Viewed