చెఫ్‌గా మారిన గ్యాంగ్ స్టర్… ఏడేళ్ల తర్వాత ఊహించని ట్విస్ట్!

by  |
చెఫ్‌గా మారిన గ్యాంగ్ స్టర్… ఏడేళ్ల తర్వాత ఊహించని ట్విస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: హీరో ఒక గ్యాంగ్ స్టర్… డ్రగ్స్, మాఫియా అంటూ ఎన్నో అరాచకాలు చేస్తూ ఉంటాడు. కానీ అతనిని పోలీసులు పట్టుకోలేకపోతారు.. కొన్ని అనివార్య కారణాల వలన హీరో వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి మంచిగా హోటల్ లో చెఫ్ గా మారిపోతాడు… ఎప్పటికి హీరో పోలీసులకు దొరక్కుండా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ప్రతి గ్యాంగ్ స్టర్ సినిమాలలోనూ ఇంచుమించు ఇలాంటి కథలే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి ఒక స్టోరీ నిజజీవితంలో జరిగితే … జరిగితే ఏంటి జరిగింది. ఎక్కడో తెలుసా.. ఇటలీలో.

ఇటలీలోని డొమినికన్ రిపబ్లిక్ లో ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ ఉండేవాడు. అతను నెదర్లాండ్స్ కి డ్రగ్స్ సప్ప్లై చేస్తూ ఉండేవాడు. అతని కోసం ఇటాలియన్ పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. కానీ అతనెప్పుడూ పోలీసులకు చిక్కలేదు. అయితే 2014 నుండి అతని చేస్తున్న దందా ఆగిపోయింది. అయినా సరే అతనికోసం పోలీసుల గాలింపు చర్యలు ఆగలేదు. ఇంతలోనే ఒక యూట్యూబ్ ఛానెల్లో ఒక వ్యక్తి చేస్తున్న వంట వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. మొఖం చూపెట్టకుండా వీడియోలు చేస్తున్న ఆ వ్యక్తి పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే 7 ఏళ్ళ క్రితం మూసివేసిన గ్యాంగ్ స్టర్ కేసును తిరిగి తోడారు.

అందులో ఆ గ్యాంగ్ స్టర్ ఒంటిపై ఉన్న టాటూలను, వంట వీడియో లు పెడుతున్న వ్యక్తి టాటూలను పోల్చి చూసారు. అంతే ఒక్క క్షణం షాక్ అయ్యారు. ఒక పెద్ద గ్యాంగ్ స్టార్ ఒక చెఫ్ అవతారమెత్తి యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నాడని తెలుసుకున్నారు. వెంటనే ఒక ప్లాన్ ప్రకారం వెళ్లి గ్యాంగ్ స్టర్ ని అరెస్ట్ చేసారు. సినిమాలలో లానే మొత్తం ప్లాన్ చేసాడు కానీ టాటూల దగ్గర అడ్డంగా దొరికిపోయాడు



Next Story

Most Viewed