పాల్ దినకరన్ నివాసంలో ఐటీ సోదాలు

79

దిశ,వెబ్ డెస్క్: చెన్నైలో క్రైస్తవ మత ప్రభోదకుడు పాల్ దినకరన్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాల్ దినకరన్‌కు చెందిన కార్యాలయాలు, భవనాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత, విదేశాల్లో పెట్టుబడులపై ఐటీ అధికారులు ఈ దాడులను చేస్తున్నారు. మొత్తం 28 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చెన్నై అడయార్‌లోని ప్రధాన కార్యాలయంలో, కారుణ్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, జీసస్ కాల్స్ మినిస్ట్రీ కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. సోదాల్లో దాదాపు 200 మంది అధికారులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..