- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐటీ హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ రూ.5లక్షల విరాళం
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నివారణ చర్యల సహాయానికి ఐటీ హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు రూ. 5లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి రక్షణ పరికరాలు అందించేందుకు ఖర్చు చేయాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. పోలీసులకు మద్దతుగా కరోనా నివారణ చర్యల కోసం సహాయాన్ని అందించి దాతృత్వం చాటుకున్న హాస్టల్ అసోసియేషన్ సభ్యులను సీపీ సజ్జనార్ ఈ సందర్భంగా అభినందించారు. ప్రజల కోసం తమ జీవితాలను ప్రమాదంలో ఉంచి […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నివారణ చర్యల సహాయానికి ఐటీ హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు రూ. 5లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి రక్షణ పరికరాలు అందించేందుకు ఖర్చు చేయాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. పోలీసులకు మద్దతుగా కరోనా నివారణ చర్యల కోసం సహాయాన్ని అందించి దాతృత్వం చాటుకున్న హాస్టల్ అసోసియేషన్ సభ్యులను సీపీ సజ్జనార్ ఈ సందర్భంగా అభినందించారు. ప్రజల కోసం తమ జీవితాలను ప్రమాదంలో ఉంచి పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది కోసం ఖర్చు చేస్తామని సీపీ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ఏడీసీపీ మాణిక్ రాజ్, ఏసీపీ సంతోష్ పాల్గొన్నారు.
tags: Corona Virus, IN Hostel Owners Association Donation, Cyberabad CP Sajjanar, Lockdown, Police
Next Story






