'దిశ' ఎఫెక్ట్.. ఇస్రోజివాడిలో వీడీసీ రద్దు

by  |
దిశ ఎఫెక్ట్.. ఇస్రోజివాడిలో వీడీసీ రద్దు
X

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలం ఇస్రోజి వాడి గ్రామంలో గల వీడీసీ ని గ్రామస్తులు రద్దు చేశారు. ఇటీవల గ్రామంలో వీడీసీ ఆగడాలు పెరిగిపోయాయని, కల్లు దుకాణం టెండర్ విషయంలో గ్రామస్తులకు తెలియకుండా ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలను ‘ దిశ ‘ వెలుగులోకి తీసుకు వచ్చిన విషయం పాఠకులకు విదితమే. రహస్యంగా కల్లు దుకాణానికి టెండర్లు నిర్వహించి తక్కువ డబ్బులకు ఓ వ్యక్తికి అప్పగించినట్లు దిశ వెలుగులోకి తీసుకురావడంతో గ్రామస్తులు గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామస్తులంతా ఏకమై గ్రామంలో అసలు వీడిసీ వద్దని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు వీడీసీ ని రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాకుండా గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పండగలు, ఉత్సవాల్లో గ్రామంలో గల అన్ని కుల సంఘాల నుంచి ఒక ప్రతినిధి ముందుకు వచ్చి బాధ్యతలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇకనుంచి వీడీసీ ఉండదని, ఎవరి పెత్తనం కొనసాగదని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా గ్రామంలో జరిగే అక్రమాలను బయటకు తీసుకు వచ్చిన దిశకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed