డమాస్కస్, దక్షిణ సిరియా లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు.!

85

దిశ, వెబ్ డెస్క్ : ఈరోజు తెల్లవారుజామున ఇజ్రాయెల్.. సిరియాపై క్షిపణి దాడులు చేసింది. ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు లెబనాన్​ మీదుగా ప్రయాణిస్తూ.. సిరియా రాజధాని డమస్కస్, దక్షిణ సిరియా ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు ఆ దేశ స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, ఈ దాడి ఘటనలో ఎంత మంది మృతిచెందారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. సిరియాలో.. ఇరాన్‌తో సంబంధాలున్న మిలిటరీ బృందాలే లక్ష్యంగా ఇజ్రాయెల్​పలుమార్లు క్షిపణి దాడులు జరిపింది. లెబనాన్- సిరియా సరిహద్దు ప్రాంతంలో సిరియా డిఫెన్స్ మిసైల్​పేలినట్లు లెబనాన్​మీడియా తెలిపింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..