- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీహార్ జైల్లో ఐసోలేషన్ వార్డు
<p>న్యూఢిల్లీ: కరోనా విజృంభన నేపథ్యంలో ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులు సైతం ఈ వైరస్ కట్టడికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే జైల్లో ఉన్న సుమారు 17వేల మంది ఖైదీలకు వైద్య పరీక్షలు జరుపగా, ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ, ముందు జాగ్రత్తగా జైల్లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఖైదీల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించినట్టయితే, వారిని ఈ వార్డుల్లో ఉంచనున్నారు. అలాగే, కొత్తగా వచ్చే ఖైదీలకు స్క్రీనింగ్ చేసి, 14రోజుల పాటు ప్రత్యేకవార్డులో ఉంచి […]</p>

X
న్యూఢిల్లీ: కరోనా విజృంభన నేపథ్యంలో ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులు సైతం ఈ వైరస్ కట్టడికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే జైల్లో ఉన్న సుమారు 17వేల మంది ఖైదీలకు వైద్య పరీక్షలు జరుపగా, ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ, ముందు జాగ్రత్తగా జైల్లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఖైదీల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించినట్టయితే, వారిని ఈ వార్డుల్లో ఉంచనున్నారు. అలాగే, కొత్తగా వచ్చే ఖైదీలకు స్క్రీనింగ్ చేసి, 14రోజుల పాటు ప్రత్యేకవార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. అనంతరం కరోనా నెగటివ్ వచ్చిన ఖైదీలను అందరూ ఉండే ఖైదీల్లో చేరుస్తున్నారు.
Tags: coronavirus, tihar, jail, delhi, covid-19, jail officers, isolation ward
Next Story






