జార్ఖండ్‌, ఢిల్లీలో ఐసిస్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌.. భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-10 05:02:54  IST  )

దేశంలో ఐఎస్ఐఎస్ ప్రేరిత ఉగ్రవాద మూకలు సంచరిస్తున్నాయంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ విశ్వసనీయ సమాచారం ఇచ్చింది.

జార్ఖండ్‌, ఢిల్లీలో ఐసిస్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌.. భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఐఎస్ఐఎస్ (ISIS) ప్రేరిత ఉగ్రవాద మూకలు సంచరిస్తున్నాయంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ విశ్వసనీయ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్‌ (Delhi Special Police Cell) ‘లక్ష్యిత’ పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం సౌత్ ఢిల్లీ (South Delhi)లో ముంబైకి చెందిన ఆఫ్తాబ్ (Aftab) అనే ఐసిస్ ఉగ్రవాదిని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుశ్వాహా (Pramod Kushwaha) నేతృత్వంలో చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

ఇక జార్ఖండ్‌లోని బొకారో జిల్లా ఇస్లామ్‌ నగర్‌లోని తబరక్ లాడ్జ్‌లో డానిష్ (Danish) అనే మరో ఐసీసీ అనుమానిత ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్, ఝార్ఖండ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (Jharkhand Anti-Terrorism Squad) సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, రాడికలైజేషన్ మెటీరియల్, కమ్యూనికేషన్ లాగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పట్టుబడిన ఆఫ్తాబ్, డానిష్, అదుపులోకి తీసుకున్న మరికొందరిని ఢిల్లీకి రిమాండ్‌పై తరలించారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఉగ్రవాదులతో లింక్ ఉన్న 12 మందిని ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.

Next Story