ధనుష్ హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో ఇండియన్ బ్యూటీ

180
Dhanush, Ishwarya Sonar

దిశ, సినిమా: మల్టీ టాలెంటెడ్ ధనుష్ అప్ కమింగ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ద గ్రే మ్యాన్’. నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ కాస్ట్‌లియెస్ట్ ప్రాజెక్ట్‌కు రుస్సో బ్రదర్స్ దర్శకులు కాగా.. మార్క్ గ్రేనీ రచించిన ‘ద గ్రే మ్యాన్’ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ధనుష్ ఇప్పటికే సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌‌లో పాల్గొనగా.. తాజాగా మరో ఇండియన్ ఈ సినిమా యూనిట్ మెంబర్‌గా జాయిన్ కాబోతున్నారు. ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో యంగ్ యాక్ట్రెస్ ఐశ్వర్యా సోనార్ నటించబోతోంది. దాదాపు ఆరు నెలలుగా ఈ ప్రాసెస్ నడుస్తోందని.. సినిమా ఆడిషన్ కోసం వీడియో సెండ్ చేసి అన్ని మూవీస్‌లాగే ఆడిషన్ ఇచ్చి మరిచిపోయానన్న ఆమె.. ఫైనల్‌గా మూవీ యూనిట్ తనను ఫైనల్ చేశారని కన్‌ఫర్మ్ చేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..