‘వకీల్ సాబ్’ వచ్చెదెప్పుడో ?

by  |
‘వకీల్ సాబ్’ వచ్చెదెప్పుడో ?
X

అజ్ఞాతవాసి తర్వాత పవర్ స్టార్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి.. రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. పవన్‌ను వెండితెరపై చూసి రెండేళ్లకుపైగానే అయిపోయింది. ఇక మళ్లీ సినిమాల్లోకి ‘‘వకీల్ సాబ్’’గా రాబోతున్నాడని తన అభిమానులంతా ఖుషీ అయ్యారు. కానీ, ఇప్పుడు కరోనా కారణంగా పవన్ సినిమా కూడా వాయిదా పడేలా కనిపిస్తుంది. వకీల్ సాబ్‌ విడుదలకు కూడా కరోనా సోకేలా కనిపిస్తుంది.

వకీల్‌సాబ్‌ను మే 15న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ చిత్ర షూటింగ్ ఈ నెల 21 నుండి మొదలుపెట్టి, ఏప్రిల్‌తో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్రబృందం భావించింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా షెడ్యూల్ అంతా మారిపోయేలా కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తుంటే ఆ రోజు నుండి షూటింగ్ చేయడం దాదాపు కుదరని పని. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుండి షూటింగ్ మొదలుపెడితే చిత్రాన్ని రిలీజ్ టైమ్‌కు సిద్ధం చేయడం చాలా కష్టం. వాయిదా పడ్డ రీ షెడ్యూల్స్‌ని బట్టి విడుదల తేదీలు ఫిక్స్ అవుతాయి. అవన్నీ చూసుకుని వకీల్ సాబ్‌కి సరైన డేట్ సెట్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఓ పాట, కీలకమైన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ప్రమోషన్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తోపాటు, వేరే సినిమాల తేదీలతో క్లాష్ కాకుండా చూసుకోవాలి. ఈ లెక్కలన్నీ వేసుకుంటే.. పవన్ సినిమా ఎప్పుడు వస్తుందో చెప్పడం కాస్త కష్టమే. మరి చిత్రబృందం తమ షెడ్యూల్ ప్రకారమే సినిమా చేసి విడుదల చేస్తుందో లేక వాయిదా వేస్తుందో వేచి చూడాలి. రిలీజ్ వాయిదా పడుతుందనే విషయం తెలిసి పవర్‌స్టార్ అభిమానులు కూడా బాగా ఫీల్ అవుతున్నారు. పింక్ సినిమా రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. దాంతోపాటు క్రిష్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు.

tags : pawan kalyan, power star, vakeel saab, pink remake, dil raju, tollywood, telugu cinema,

Next Story

Most Viewed