తాలిబాన్ల నెక్ట్స్ టార్గెట్ కశ్మీర్..?

by  |
talibans next target kashmir
X

Is talibans next target kashmir? Home Minister Amit Shah review on the latest situation in Jammu and Kashmir.

దిశ, వెబ్ డెస్క్ : అప్గన్ లో అష్రఫ్ గనీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్న ఉగ్రమూకలు ఇప్పుడ కశ్మీర్ (kashmir) వైపు చూస్తున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తాలిబాన్లు (talibans) గీసుకున్న గీతలనే పాకిస్తాన్ కూడా పాటిస్తోంది. మహిళల వస్త్రధారణ దగ్గరి నుంచి విద్యాబుద్దులు వరకూ అన్నిటి పైనా ఉగ్ర ప్రభుత్వం ఆంక్షల అస్త్రాలు వాడుతోంది. పాక్ అడ్డాగా ఉగ్రవాదాన్ని నడుపుతున్న అగ్ర నాయకులు అంతా తాలిబన్ల మెప్పుకోసం క్యూ కట్టిన విషయం తెలిసిందే. హిజ్బుల్ నుంచి మొదలుకొని, లష్కరే నాయకుల వరకూ తమకు కశ్మీర్ కావాలని తాలిబాన్ల వద్దకు వెళ్లి వచ్చారు.

మొదట్లో కశ్మీర్ అంశం పాక్ – భారత్ లు తేల్చుకోవాలి అన్న తాలిబాన్లు త్వరగానే మాట మార్చారు. కశ్మీర్ లో ముస్లిం ల కోసం తమ గళాన్ని వినిపిస్తాం అంటూ ప్రకటనలు చేశారు. ఇవన్నీ గమనించిన భారత్ తగిన సమయం కోసం ఎదురు చూసింది. తాలిబాన్లు స్నేహ హస్తం చాచినా ఆచి తూచి అడుగులు వేసింది. ఇప్పుడు కూడా నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో మరొక్కసారి అప్రమత్తం అయింది. ఇప్పటికే ఐబీతో పాటు రా వంటి సంస్ధలు కూడా కశ్మీర్ లో తాజా పరిస్ధితిపై కేంద్రానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా జమ్ము కశ్మీర్ లో తాజా పరిస్ధితిపై సమీక్ష నిర్వహించారు.

జమ్మూ అధికారలతో ఎప్పటికప్పుడు అమిత్ షా సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్ధాయిలో శాంతి భద్రతలు, ఇతర పరిస్ధితుల్ని అడిగి తెలుసుకున్నారు. తాలిబన్లపై నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని అధికారులకు తెలియజేసి ఎలాంటి పరిస్ధితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో జమ్ము కశ్మీర్ లో చేపట్టిన కీలక ప్రాజెక్టుల పురోగతిని కూడా అమిత్ షా తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వ హించిన సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో పాటు ఆర్మీ చీఫ్ నరవణే , జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోం కార్యదర్శి అజయ్ భల్లా తో పాటు కొంత మంది కీలక అధికారులు కూడా పాల్గొన్నారు. సుమారు రెండుగంటల పాటు జరిగిన ఈ భేటీలో అమిత్ షా కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. కశ్మీర్ పై ఉన్న ఉగ్ర కన్ను తో పాటు ఈ ప్రాంతం అభివృద్ది పైనా దృష్టి పెట్టాలని చెప్పినట్టు సమాచారం. కశ్మీర్ ను రక్షించే క్రమంలో స్థానికుల నుంచి తిరుగుబాటు రాకుండా చూసుకోవాలని కూడా ఆదేశించినట్టు సమాచారం.

ఇప్పటికే జమ్మూ విమానాశ్రం తో పాటు మరి కొన్ని చోట్ల పాకిస్తాన్ కు చెందిన ఉగ్ర సంస్థలు డ్రోన్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే .. అయితే మళ్లీ అదే తరహా దాడులు జరగ వచ్చ అనే సమాచారం తో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. ఈ అంశాన్ని కూడా సమీక్షించినట్టు ఆర్మీ ఉన్నత అధికారి ఒకరు తెలిపారు. తాలిబన్ల సహకారంతో పాక్ ఉగ్రమూకలు డ్రోన్ దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది కేంద్రం. కశ్మీర్ లో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు అందించాలని అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఏమరు పాటు తగదని దాని వల్ల భారత్ మరిన్ని ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుందని హోం మంత్రి హెచ్చరించినట్టు సమాచారం.

Read also :తాలిబన్స్ VS సోషల్ మీడియా



Next Story