మామ ప్లేస్‌లో ‘‘సామ్’’..బిగ్ బాస్ హోస్ట్ ?

by  |
మామ ప్లేస్‌లో ‘‘సామ్’’..బిగ్ బాస్ హోస్ట్ ?
X

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఆడియన్స్‌కు మస్త్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. కంటెస్టెంట్‌లు కొత్త వారే అయినా సరే..ఆడియన్స్‌ను మెప్పించడంలో సక్సెస్ అయ్యారు. లవ్ స్టోరీస్, ఫ్రెండ్‌షిప్స్, పొట్లాటలు, అలకలతో షో ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. హోస్ట్ నాగార్జున సైతం వీకెండ్ ఎపిసోడ్స్‌లో అంతకు మించిన ఎనర్జీని ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు. తప్పు చేసిన ఇంటి సభ్యులను హెచ్చరిస్తూనే ..ఫన్ క్రియేట్ చేయడంలో బెస్ట్ అనిపించుకున్నారు.

అయితే, కింగ్ నాగార్జున విదేశాల్లో ‘వైల్డ్ డాగ్’ మూవీ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండటంతో రెండు వారాలు షో హోస్టింగ్ బాధ్యతలు మరో సెలెబ్రిటీకి అప్పగించే అవకాశం ఉంది. గత సీజన్‌లో రమ్యకృష్ణ స్పెషల్ హోస్ట్‌‌గా విచ్చేయగా..ఈ ఏడాది నాగ్ కోడలు సమంత అక్కినేని ఆ బాధ్యత తీసుకోనుంది అని సమాచారం. ప్రస్తుతం సామ్ అటు ఆన్‌లైన్ బిజినెస్..ఇటు ఎకం స్కూల్, మరోవైపు యువర్ లైఫ్ కోసం చేస్తున్న షూటింగ్ పనుల్లో బిజిగా ఉండగా నిజంగా బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తుందా? అనేది ప్రశ్న.



Next Story