నెగెటివ్ రోల్‌లో సామ్?

by  |
నెగెటివ్ రోల్‌లో సామ్?
X

దిశ, వెబ్ డెస్క్: నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను అద్భుతంగా బిల్డ్ చేసుకుంటున్న నటి సమంత. మ్యారేజ్ తర్వాత నుంచి తను చేసిన పాత్రలన్నీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కాగా, సామ్ ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో ‌డిజిటల్ వరల్డ్‌లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ‘ఫ్యామిలీ మ్యాన్’ తొలి సీజన్

సూపర్ సక్సెస్ సాధించిన విషయం విదితమే. తీవ్రవాద ఇతివ‌ృత్తంతో తెరకెక్కించిన ఈ సిరీస్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. దాంతో రెండో సీజన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సీజన్‌లో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వెబ్ సిరీస్‌లో అక్కినేని కోడలు నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నారని సమాచారం.

ఫ్యామిలీ మ్యాన్ తొలి సీజన్‌కు కొనసాగింపుగా ‘ఫ్యామిలీ మ్యాన్ -2’ వస్తున్నది. స్పై థ్రిల్లర్‌గా వస్తున్నఈ సీరీస్‌లో ప్రతి క్యారెక్టర్‌కూ ప్రాధాన్యత ఉంటుంది. నెగెటివ్ రోల్‌కు మరింత పేరు వస్తుంది. ఈ క్రమంలోనే సామ్ ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఒక పాకిస్థానీ టెర్రరిస్ట్ పాత్ర అని, స్లీపర్ సెల్‌గా చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి సమంత క్యారెక్టర్‌ను ఆకాశానికెత్తేసింది. సామ్ పాత్ర షాకిస్తుందని ఆశ్చర్యానికి లోను చేస్తుందని వ్యాఖ్యానించింది. ప్రియమణి వ్యాఖ్యలను బట్టి చూస్తే సామ్ పాత్ర తప్పకుండా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకుల షాక్ ఇస్తుందని తెలుస్తోంది. నిజానికి ఈపాటికే ఈ సీరీస్ రిలీజ్ కావాల్సి ఉన్నా లాక్‌డౌన్ వల్ల కొంత భాగం చిత్రీకరణ నిలిచిపోయింది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో టెలికాస్ట్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాయ్‌పాయ్, ప్రియమణి, సందీప్ కిషన్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


Next Story