మెగాఫోన్ పట్టుకోబోతున్న స్టార్ కమెడియన్..

by  |
Priyadarshi
X

దిశ, సినిమా: ‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ స్టార్ కమెడియన్‌గా ఎదిగిన ప్రియదర్శి.. ‘మల్లేశం, లూజర్’ వంటి ప్రాజెక్ట్‌లతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రీసెంట్‌గా ‘నాంది, జాతిరత్నాలు’ చిత్రాల్లో కనిపించి ప్రశంసలు అందుకున్న ఆయన.. ‘రాధే శ్యామ్, ఎఫ్ 3’ సినిమాల్లోనూ కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు. కాగా ఈ స్టార్ కమెడియన్ ఇప్పుడు డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టుకోబోతున్నారని సమాచారం. దర్శకుడిగా మారతానని గతంలోనూ పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించిన ప్రియదర్శి.. తన డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్న ఆయన.. చిన్న హీరోతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. స్టోరీ లైన్ విన్న నిర్మాత ఇందుకు ఓకే చెప్పారని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగానే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని సమాచారం.



Next Story