రెండో పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్.. ఫ్యూచర్ హజ్బెండ్ అతనే..

by  |
heroine
X

దిశ, సినిమా : లేట్ యాక్టర్ చిరంజీవి సర్జా మరణంతో ఒంటరి అయిపోయింది భార్య మేఘనా రాజ్. కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన చనిపోయే సమయానికి మేఘా ప్రెగ్నెంట్ కాగా.. ఓ బేబి బాయ్‌కు జన్మనిచ్చింది. ప్రస్తుతం పది నెలలు నిండిన జూనియర్ చిరు సర్జాకు రాయన్ సర్జా అని పేరు పెట్టారు. ఇదిలా ఉంటే.. మేఘా రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. బిగ్ బాస్ 4 కన్నడ టైటిల్ విన్నర్ ప్రథమ్‌ను ఫ్యూచర్ హజ్బెండ్‌గా సెలెక్ట్ చేసుకుందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది.

దీనిపై స్పందించిన ప్రథమ్.. ‘ఇకనైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందని వెయిట్ చేశా. రిప్లయ్ ఇవ్వకుండా వదిలేద్దామని అనుకున్నా. కానీ ఓ యూట్యూబ్ చానల్ ప్రసారం చేసిన వీడియోకు ఇప్పటికే 2.70 లక్షల వ్యూస్ వచ్చాయి. డబ్బు కోసం ఇలాంటి నీచమైన పనులు చేసినప్పుడు లీగల్‌గా ఫైట్ చేయడమే బెటర్. ఇలాంటి వీడియోస్‌ను చట్టపరంగా డిలీట్ చేస్తే ఇతర చానల్స్‌కు గుణపాఠం అవుతుంది’ అని ట్వీట్ చేశాడు.



Next Story

Most Viewed