ప్రెగ్నెంట్ అయిన కాజల్ అగర్వాల్.. రచ్చ చేస్తోన్న ఫ్యాన్స్!

by  |
ప్రెగ్నెంట్ అయిన కాజల్ అగర్వాల్.. రచ్చ చేస్తోన్న ఫ్యాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గర్భవతి అయ్యింది అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అక్టోబర్ 2020లో తన చిరకాల స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహమాడింది. ఆ తరువాత అడపాదడపా అక్కడక్కడా కనిపించినా అంతకుముందులా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు అన్నది మాత్రం వాస్తవం. అయితే గతకొన్నిరోజులుగా అమ్మడు అసలు సోషల్ మీడియాల్లో కనిపించడం లేదు. దీంతో ఆమె అభిమానులు కాజల్ ప్రెగ్నెంట్ అయిందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తాజాగా సోషల్ మీడియాలో ఒక యూజర్ కాజల్ – కిచ్లు ఇంట్లో ఒక శుభవార్త అని పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. శుభవార్త అనగానే.. కాజల్ ప్రెగ్నెంట్ అయ్యి ఉంటుందని అనుకోని ఆమెకు అభిమానులు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ఇక కాజల్ కూడా తన భర్త గౌతమ్ కిచ్లుతో తన మొదటి బిడ్డను ఆశిస్తోందని కథనాలొస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఇక కాజల్ ప్రెగ్నెంట్ వార్తలపై మీమ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' లో నటిస్తున్న కాజల్ తన షెడ్యూల్స్ ని ఇప్పటికే ముగించింది. ప్రస్తుతం నాగార్జున అక్కినేని నటించిన 'ది ఘోస్ట్' షూటింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాల తర్వాత ఆమె సినిమాలకు విరామం చెప్పనుందని కూడా టాక్ నడుస్తోంది.

https://www.instagram.com/p/CTxJpAjpqyn/

Next Story

Most Viewed