- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరదసాయం టీఆర్ఎస్‌కు ఇరకాటమేనా..?
<p>దిశ ప్రతినిధి , హైదరాబాద్ : తానొకటి తలిస్తే దైవ మొకటి తలచిందన్నట్లుగా మారింది వరద ముంపు సాయం. మహా నగర పాలక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందు ముంపు బాధితులు మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలా చేసుకున్న వారికి నేరుగా వారి ఖాతాలో రూ.10 వేలు వేశారు. ఈ వార్త నగరంలో విస్తృతంగా ప్రచారం కావడంతో బుధవారం తెల్లవారు జామున 6 గంటల నుంచే ప్రజలు మీ సేవా […]</p>

దిశ ప్రతినిధి , హైదరాబాద్ :
తానొకటి తలిస్తే దైవ మొకటి తలచిందన్నట్లుగా మారింది వరద ముంపు సాయం. మహా నగర పాలక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందు ముంపు బాధితులు మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలా చేసుకున్న వారికి నేరుగా వారి ఖాతాలో రూ.10 వేలు వేశారు. ఈ వార్త నగరంలో విస్తృతంగా ప్రచారం కావడంతో బుధవారం తెల్లవారు జామున 6 గంటల నుంచే ప్రజలు మీ సేవా కేంద్రాల వద్ద బారులు దీరారు. 10 గంటల సమయానికి ఒక్కో మీ సేవా కేంద్రం వద్ద వేల మంది జమకావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని క్యూ లైన్లో నిల్చోబెట్టారు. అయితే వారికి ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. తక్షణమే దరఖాస్తుల స్వీకరణను ఆపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎక్కడికక్కడ నిరసనలు
ఈ తరుణంలోప్రభుత్వం వరద ముంపు సహాయాన్ని నిలుపు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. పలు చోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. రాంనగర్ లో రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్థంబించిపోయింది. వనస్థలిపురంలో జరిగిన తోపులాటలో పలువురు మహిళలు గాయపడ్డారు. అబిడ్స్ మీ సేవా కేంద్రం వద్ద ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చక్క దిద్దారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు గంటల పాటు క్యూ లైన్లో నిలుచున్న ఓ 50 ఏండ్ల మహిళ మృతి చెందింది.
టీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం
వరద ముంపు సహాయానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ బ్రేక్ వేయడంతో నగరంలోని పలు చోట్ల ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఎస్ఈసీ ప్రకటన వెలువడే సమయానికే గంటల తరబడి మీ సేవా కేంద్రాల వద్ద తోపులాటల మధ్య నిల్చుని ఉన్న ముంపు బాధితుల సహనం కట్టలు తెంచుకుంది. దీంతో సీఎంతో పాటు అధికార పార్టీ నాయకులను శాపనార్ధాలు పెట్టారు. సర్వం కోల్పోయి మేం ఇబ్బందులు పడుతుంటే మీకు ఆటలుగా ఉందా అంటూ నిలదీశారు. బతుకమ్మ చీరలు సైతం నాణ్యతగా లేవు. అవి కూడా ఇస్తున్నామంటూ తిప్పించుకుని చివరకు ఇవ్వకుండా దాటేశారు. ఇప్పుడు వరద ముంపు సహాయంలో కూడా ఇలానేనా అంటూ మండిపడ్డారు. వరద ముంపు సహాయం అధికార పార్టీకి లాభం తెస్తుందనుకుంటే నష్టం చేసేలా ఉందనే అభిప్రాయాలు నగర ప్రజల నుంచి వ్యక్తమయ్యాయి.






