- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.9 వేల కోట్ల పాలసీ క్లెయిమ్‌లను సెటిల్ చేసిన బీమా కంపెనీలు!
by Harish |
<p>దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో దేశీయంగా ఇన్సూరెన్స్ కంపెనీలు రూ. 9,078 కోట్ల క్లెయిమ్‌లను సెటిల్ చేసినట్టు భారత బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ సుభాష్ చంద్ర కుంతియా చెప్పారు. నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇందులో రూ. 7,136 కోట్ల చెల్లింపులు జరిపారని ఆయన పేర్కొన్నారు. బీమా పరిశ్రమ కరోనా వల్ల ఏర్పడ్డ డెట్ క్లెయిమ్‌ల కింద రూ. 1,242 కోట్లను చెల్లించింది. అలాగే, కరోనా ప్రత్యేక పాలసీ క్లెయిమ్‌లను రూ. 700 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో దేశీయంగా ఇన్సూరెన్స్ కంపెనీలు రూ. 9,078 కోట్ల క్లెయిమ్‌లను సెటిల్ చేసినట్టు భారత బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ సుభాష్ చంద్ర కుంతియా చెప్పారు. నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇందులో రూ. 7,136 కోట్ల చెల్లింపులు జరిపారని ఆయన పేర్కొన్నారు. బీమా పరిశ్రమ కరోనా వల్ల ఏర్పడ్డ డెట్ క్లెయిమ్‌ల కింద రూ. 1,242 కోట్లను చెల్లించింది. అలాగే, కరోనా ప్రత్యేక పాలసీ క్లెయిమ్‌లను రూ. 700 కోట్ల వరకు చెల్లించాయి. పరిశ్రమ సానుకూల వృద్ధిని సాధిస్తోందని సుభాస్ చంద్ర కుంతియా పేర్కొన్నారు. భవిష్యత్తులో కరోనా వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ బీమా కంపెనీలు కొనసాగుతాయన్నారు. పాలసీలను విక్రయించే సమయంలో, క్లెయిం చేస్తున్నప్పుడు మాత్రమే బీమా సంస్థలు పాలసీదారులతో సంబంధం కలిగి ఉండాలని కుంతియా తెలిపారు.
Next Story






