ఇరాన్ తన నౌకను తానే పేల్చేసుకుంది.. 19 మంది మృతి

by  |
ఇరాన్ తన నౌకను తానే పేల్చేసుకుంది.. 19 మంది మృతి
X

టెహ్రాన్: ఇరాన్ దేశం పొరపాటుగా తన నౌకను క్షిపణి ద్వారా పేల్చేసుకుంది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. నావికాదళ విన్యాసాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇరాన్ యుద్దనౌక జమరాన్ క్షిపణిని ప్రయోగించింది. అయితే అదే సమయంలో అటువైపు వెళ్తున్న కొనరాక్ అనే నౌకను పేల్చేసింది. ప్రమాదం జరిగిన సమమంలో నౌకలో ఎంత మంది ఉన్నారో తెలియదని అధికారులు చెబుతున్నారు. గాయపడిన వారిని సిస్తాన్, బలూచిస్తాన్ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రావిన్స్ మెడికల్ యూనివర్సిటీ వైద్యుడు మహ్మద్ మెహ్రాన్ తెలిపారు. కొనరాక్ నౌకను నెదర్లాండ్స్ తయారు చేయగా, 1979లో ఇరాన్ కొనుగోలు చేసింది. ఈ ఏడాది మొదట్లో ఉక్రెయిన్‌కు చెందిన ప్యాసింజర్ విమానాన్ని కూడా ఇరాన్ ఇలాగే పొరపాటుగా క్షిపణితో పేల్చేసిన సంగతి తెలిసిందే.



Next Story