ఐపీఎల్‌లో లక్నో పేలవ ప్రదర్శన.. జహీర్‌ ఖాన్‌పై వేటు?

by Harish |

ఐపీఎల్-18లో రిషబ్ పంత్ సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన చేసింది.

ఐపీఎల్‌లో లక్నో పేలవ ప్రదర్శన.. జహీర్‌ ఖాన్‌పై వేటు?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో రిషబ్ పంత్ సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన చేసింది. ఆరు విజయాలే సాధించి 7వ స్థానంతో సరిపెట్టింది. దీంతో జట్టుపై, టీమ్ మేనేజ్‌మెంట్‌పై లక్నో యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. జట్టును ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకోబోతున్నట్టు సమాచారం. మెంటార్ జహీర్ ఖాన్‌పైనే తొలి వేటు వేయనున్నట్టు తెలుస్తోంది. జహీర్ ఖాన్‌తో లక్నో ఫ్రాంచైజీ ఒక ఏడాది ఒప్పందం చేసుకుంది. ఈ సీజన్‌లో పేలవ పర్ఫామెన్స్ నేపథ్యంలో వచ్చే సీజన్‌కు అతను కొనసాగే అవకాశం లేదు.

అలాగే, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ భవిష్యత్తుపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 269 రన్సే చేశాడు. ఆఖరి మ్యాచ్‌లో చేసిన సెంచరీ మినహా అతను గొప్పగా రాణించలేదు. దీంతో వచ్చే సీజన్‌కు పంత్‌ను తప్పించే అవకాశం కూడా లేకపోలేదు. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఫ్రాంచైజీ వ్యవహారాల్లో భాగమవుతారన్న విషయం తెలిసిందే. గతేడాది కేఎల్ రాహుల్‌‌పై మైదానంలోనే ఫైర్ అవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సీజన్‌లో జట్టు ఘోరంగా వైఫల్యం చెందిన నేపథ్యంలో ఆయన కచ్చితంగా చర్యలు తీసుకుంటారని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.


Next Story