- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా కొడుకు కెరీర్‌ను మార్చింది అతనే.. ఆ క్రికెట్ దిగ్గజానికి క్రెడిట్ ఇచ్చిన యశ్ దయాల్ తండ్రి
గత సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న యశ్ దయాల్ జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడు.

దిశ, స్పోర్ట్స్ : విరాట్ కోహ్లీ తన కొడుకు కెరీర్‌ను మార్చాడని యశ్ దయాల్ తండ్రి చందర్‌పాల్ దయాల్ తెలిపారు. గత సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న యశ్ దయాల్ జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడు. శుక్రవారం చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 15 రన్స్ కాపాడి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో బెంగళూరు 2 పరుగుల తేడాతో గెలిచి దాదాపు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
ఈ సందర్భంగా చందర్‌పాల్ దయాల్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడంటే విరాటే కారణమన్నాడు. యశ్ దయాల్‌కు కోహ్లీ మద్దతుగా నిలిచాడని, ఆత్మవిశ్వాసం నింపాడని చెప్పాడు. ‘ఆర్సీబీలో చేరిన తర్వాత యశ్‌కు కోహ్లీ చాలా మద్దతుగా నిలిచాడు. కొన్నిసార్లు యశ్‌ను తన రూంకు రమ్మనేవాడు. కొన్నిసార్లు అతనే యశ్ గదికి వెళ్లేవాడు. ‘కష్టపడుతూనే ఉండు. నీకు నేనున్నా . భయపడకు. మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. ముందుకు సాగాలి’ అని యశ్‌లో ఆత్మవిశ్వాసం నింపేవాడు. యశ్‌పై ఎలాంటి భారం మోపలేదు. అతను స్వేచ్ఛగా ఆడుతున్నాడంటే కోహ్లీనే కారణం. యశ్‌ను ఫియర్‌లెస్ క్రికెటర్‌గా మార్చాడు.’ అని చందర్‌పాల్ దయాల్ చెప్పుకొచ్చాడు.
కాగా, ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ యశ్ దయాల్‌కు ఎప్పటికీ చేదు జ్ఞాపకమే. ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో పేలవ బౌలింగ్‌తో గుజరాత్ ఓటమికి కారణమై యశ్ దయాల్ తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు.






