- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Virat Kohli: టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్సీ అందుకే వదిలేశా.. అసలు విషయం చెప్పిన కోహ్లీ
2021లో ఎవరూ ఊహించని విధంగా టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికాడు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కోహ్లీ వెల్లడించాడు.

దిశ, స్పోర్ట్స్: 2021లో ఎవరూ ఊహించని విధంగా టీమిండియా టీ20 జట్టుతోపాటు ఆర్సీబీ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ (Virat Kohli) వీడ్కోలు పలికాడు. ఆ తర్వాతి సంవత్సరమే టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. అలా కోహ్లీ ఎందుకు చేశాడో? అలాంటి షాక్ ఎందుకిచ్చాడో ఎవరికీ అర్థం కాలేదు. ఇంతకాలం తర్వాత తన నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని కోహ్లీ వెల్లడించాడు. కెప్టెన్సీ ఒత్తిడితోపాటు తన బ్యాటింగ్‌పై నిరంతరం విశ్లేషణలు.. ఇవన్నీ తట్టుకోలేకపోయానని, అందుకే కెప్టెన్సీ వదులుకున్నానని కోహ్లీ (Virat Kohli) చెప్పాడు.
‘ఒకానొక టైంలో చాలా కష్టంగా అనిపించింది. టీమిండియాకు 7-8 ఏళ్లు సారధ్యం వహించా. ఆర్సీబీకి 9 ఏళ్లు కెప్టెన్సీ చేశా. అదే సమయంలో ఆడిన ప్రతి మ్యాచులో నేను బాగా బ్యాటింగ్ చేయాలనే ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. నా మీదనే అందరి ఫోకస్ ఉండేది. అయితే కెప్టెన్సీ విషయంలో లేదంటే నా బ్యాటింగ్‌పై. 24 గంటలూ నాపై ఇలా ఫోకస్ ఉండటంతో జీవితం కష్టంగా మారింది. చివరకు నేను సంతోషంగా ఉండటం కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది’ అని కోహ్లీ (Virat Kohli) వివరించాడు. అప్పుడే తనకంటూ లైఫ్‌లో కొంత స్పేస్ అవసరం అనిపించిందని, ఎవరి జడ్జిమెంట్ లేకుండా వచ్చి తన ఆట ఆడాలని అనుకున్నానని చెప్పాడీ స్టార్ బ్యాటర్.






