- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > Virat Kohli : ఎదురులేని కోహ్లీ.. ఐపీఎల్‌లో ఆ రికార్డు కూడా విరాట్ సొంతం
Virat Kohli : ఎదురులేని కోహ్లీ.. ఐపీఎల్‌లో ఆ రికార్డు కూడా విరాట్ సొంతం
by Harish |
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పేరిట మరో రికార్డు నమోదైంది.

X
దిశ, స్పోర్ట్స్ : రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పేరిట మరో రికార్డు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు 50+ స్కోరు చేసిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు. పంజాబ్‌పై 73 రన్స్ చేయడంతో విరాట్ ఈ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో కోహ్లీ మొత్తం 67 సార్లు 50+ స్కోరు చేశాడు. అందులో 59 హాఫ్ సెంచరీలు ఉండగా.. 8 శతకాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు అత్యధికసార్లు 50+ స్కోరు చేసిన ప్లేయర్ల జాబితాలో డేవిడ్ వార్నర్(66)తో కలిసి కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. తాజాగా వార్నర్‌ను కోహ్లీ రెండో స్థానానికి నెట్టాడు. శిఖర్ ధావన్(53), రోహిత్ శర్మ(45), కేఎల్ రాహుల్(43) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Next Story






