Varun Chakravarthy: వరుణ్‌కు ఫైన్.. డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చిన బీసీసీఐ!

by Phanindra |

చెన్నయ్‌తో మ్యాచ్‌లో బ్రెవిస్‌ను అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తి.. అతనికి సెండాఫ్ ఇచ్చాడు. దీంతో అతనికి ఫైన్ వేసిన బీసీసీఐ.. ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది.

Varun Chakravarthy: వరుణ్‌కు ఫైన్.. డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చిన బీసీసీఐ!
X

దిశ, స్పోర్ట్స్: కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై (Varun Chakravarthy) బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25% కోత విధించడంతోపాటు, ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా అందించింది. చెన్నయ్‌ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌ను అవుట్ చేసిన అనంతరం అతని వైపు వేలు చూపిస్తూ, బయలుదేరు అన్నట్లు వరుణ్ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సెలబ్రేషన్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని భావించిన బీసీసీఐ వరుణ్‌కు ఫైన్ వేసింది. కాగా, ఈ మ్యాచులో ఓడిపోవడంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు క్లిష్టంగా మారిన సంగతి తెలిసిందే.

Next Story