- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Urvil Patel: సీఎస్కేలో జాయిన్ అయిన టీ20 ఫాస్టెస్ట్ సెంచరీ హీరో
ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. తమ టీంలో గాయపడిన వన్ష్ బేడీ స్థానంలో సంచలన బ్యాటర్ ఉర్విల్ పటేల్‌ను తీసుకుంది.

దిశ, స్పోర్ట్స్ డెస్క్: ఈ ఏడాది ఐపీఎల్లో పరమచెత్తగా ఆడుతూ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. వచ్చే సీజన్ కోసం సన్నాహకాలు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే టీంలో గాయపడిన వన్ష్ బేడీ స్థానంలో సంచలన బ్యాటర్ ఉర్విల్ పటేల్‌ను (Urvil Patel) రిప్లేస్‌మెంట్‌గా తీసుకుంది. ఉర్విల్ పటేల్ గురించి కొంతకాలం క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురపై కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేసి వార్తల్లో నిలిచాడీ విధ్వంసకర బ్యాటర్. టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన భారతీయ ప్లేయర్ల జాబితాలో జాయింట్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. ఓవరాల్‌గా ఈ 26 ఏళ్ల కుర్రాడు మొత్తం 47 టీ20 మ్యాచులు ఆడి 1162 పరుగులు చేశాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ టీం సభ్యుడిగా ఉన్న అతన్ని.. ఈ సీజన్లో బేస్ ధర రూ.30 లక్షలకే సీఎస్కే తీసుకుంది.
అయితే వరుసగా ఓటములు చవిచూసిన చెన్నై టీంలో (Chennai Super Kings) కుర్రాళ్లు అద్భుతంగా రాణించడం ఆ జట్టుకు స్ఫూర్తినిచ్చే అంశమే. ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, నూర్ అహ్మద్ వంటి కుర్రాళ్లు తమ అద్భుతమైన ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించారు. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠీ, దీపక్ హుడా వంటి సీనియర్ ప్లేయర్లు తేలిపోయిన సమయంలో ఈ కుర్రాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉర్విల్ పటేల్ కూడా రాణిస్తే.. వచ్చే ఏడాది ఐపీఎల్లో సీఎస్కే కొత్త కుర్రాళ్లతో చెలరేగడం ఖాయమని విశ్లేషకుల మాట.






