- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంజాబ్ కింగ్స్ ఓనర్ల మధ్య గొడవ.. కోర్టుకెక్కిన ప్రీతి జింటా
ఐపీఎల్-18లో ప్లే ఆఫ్స్ వేళ పంజాబ్ కింగ్స్ జట్టులో అంతర్గత కలహాలు బయటపడ్డాయి.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో ప్లే ఆఫ్స్ వేళ పంజాబ్ కింగ్స్ జట్టులో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోర్టు మెట్లుకెక్కడం చర్చనీయాంశమైంది. ఇతర కో ఓనర్లు అయిన మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై చండీగఢ్ కోర్టులో కేసు వేసింది. పంజాబ్ కింగ్స్ యాజమాన్య సంస్థ కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రీతి జింటా, మోహిత్ బుర్మాన్, నెస్ వాడియా, కరణ్ పాల్ డైరెక్టర్లుగా ఉన్నారు. గత నెల 21న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మునీశ్ ఖన్నాను కొత్త డైరెక్టర్‌గా ఎన్నుకున్నారు.
దీనిపై ప్రీతి జింటా కోర్టును ఆశ్రయించింది. సర్యసభ్య సమావేశం చట్టబద్ధతను కోర్టులో సవాల్ చేసింది. కంపెనీ చట్టం 2013 ప్రకారం సరైన విధానాలు పాటించలేదని పేర్కొంది. మునీశ్ ఖన్నా నియామకాన్ని మరో డైరెక్టర్ కరణ్ పాల్‌తోపాటు తాను వ్యతిరేకించామని, అయినప్పటికీ వాడియా మద్దతుతో బుర్మాన్ సమావేశాన్ని కొనసాగించారని తెలిపింది. కాబట్టి, ఆ మీటింగ్ చెల్లదని తీర్పునివ్వాలని, మునీశ్ ఖన్నా డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టకుండా నిరోధించాలని ప్రీతి జింటా కోరింది.
అలాగే, ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిలిపివేయాలని అభ్యర్థించింది. కేసు పరిష్కారమయ్యే వరకు తాను, కరణ్ పాల్ లేకుండా మునీష్ ఖన్నా ప్రమేయం లేకుండా కంపెనీ బోర్డు.. సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కంపెనీ బోర్డులో వివాదాలు ఉన్నప్పటికీ ప్రీతి జింటా మాత్రం పంజాబ్ మ్యాచ్‌లకు హాజరై జట్టుకు మద్దతినిస్తోంది. శ్రేయస్ అయ్యన్ కెప్టెన్సీలో పంజాబ్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.






